ఎవరివో..
ఎవరివో..
ఎవరివో ఎదలో నిలిచి ఎలమి పెంచినావు నీఎవరివో మదిలోనే కలిమినే ఉంచినావు
కదిలే రేయిలో కరిగించనే కమ్మని హాయిని
ఆదిలో అమృతధారలు కురిపించి వేయిని
అణువంత అల్లినావు అలవోకగ అంతనూ
తనువంత తన్మయాలు పెంచి ఇంకొంతనూ
ఎవరివో ఎదలో నిలిచి ఎలమి పెంచినావు
నీఎవరివో మదిలోనే కలిమినే ఉంచినావు
మొదటి చూపే మోహనం పెంచి మోకరిల్లే
ఎదుటి రూపానికి కనులు కట్టెనే బొమ్మరిల్లే
మొదటి చూపే మోహనం పెంచి మోకరిల్లే
ఎదుటి రూపానికి కనులు కట్టినే బొమ్మరిల్లే
దేవతల శాపానికి దిగివచ్చిన దేవ కన్యవూ
ఇవతల ఎడదలో నెమ్మి కూర్చినా ధన్యవూ
అణువంత అల్లినావు అలవోకగ అంతనూ
తనువంత తన్మయాలు పెంచి ఇంకొంతనూ
ఎవరివో ఎదలో నిలిచి ఎలమి పెంచినావు
నీఎవరివో మదిలోనే కలిమినే ఉంచినావు
కంటి చూపుతో కనికట్టులెన్నో వేసి కవ్వించి
పంటి రాపిడితో పసిడి అధరాలే పూయించి
కంటి చూపుతో కనికట్టులెన్నో వేసి కవ్వించి
పంటి రాపిడితో పసిడి అధరాలే పూయించి
తరుణం తరలివచ్చి తనువులను కదిలించి
తనరుణం తీర్చమని తీపురాలనే విదిలించి
రావించి లయించి ఊహించి మరీ ఉల్లేఖించే
ఎవరివో ఎదలోన నిలిచి ఎలమి పెంచినావు
నీ ఎవరివో మదిలోను కలిమినే ఉంచినావు
కదిలే రేయిలోన కరిగించనే కమ్మని హాయిని
ఆదిలో అమృత ధారలనే కురిపించి వేయిని
ఎవరివో ఎదలోన నిలిచి ఎలమి పెంచినావు
ఎవరివో...

