STORYMIRROR

Midhun babu

Classics Inspirational Others

4  

Midhun babu

Classics Inspirational Others

ఎటెల్లి పోతుంది మానవ జాతి

ఎటెల్లి పోతుంది మానవ జాతి

1 min
1


ఎటెల్లిపోతుంది మా'నవ'జాతి,

ఏమైపోయింది జ్ఞానకాంతి,

గుండెల్లోని పేగుబంధం వ్రేలుపట్టుకు నడుస్తుంది,

గుమ్మం దగ్గరి శునకం 

తలపై కూర్చుంది,

విహారపు వేడుకే వింతగావున్నది,

మూర్ఖమైన తలపే అనుబంధాన్ని వెక్కిరిస్తున్నది.


నేస్తమైన శునకం 

ప్రేమరుచిని వర్ణించలేనన్నది,

రక్తపాశమేమో ప్రేమచిరునామా తెలియదంటున్నది,

కన్నతల్లి నడత మనసుగొడవ చదవలేనంటున్నది,

అహంకారపు సంపద 

వెలుగుపూల గుడి తెలియదంటున్నది 

ఎటెల్లి పోతుంది మా'నవ'జాతి 

వెలవెల పోతుంది భారతఖ్యాతి.


జీవనరాగంలో అనురాగమే కనిపించకపోయింది,

బండైనగుండె 

బ్రతుకును బొమ్మలాటగా మార్చింది,

లోకం తెలియని చిన్నారిహృదయం 

బ్రతుకే అమావాస్యగా మారింది 

మాతృహృదయం మైలపడిపోతే 

ధర్మమే మూగబోతుంది.


సరదా తలపుల కన్నా 

సంప్రదాయపు కట్టుబాట్లే విలువైనవి,

వెర్రి ఆలోచన 

చిరునవ్వుల పూదోటలో 

కలుపు మొక్కగా కనిపిస్తున్నది,

చిలిపితనం

ఆత్మీయతకు ఉరి బిగిస్తే ప్రేమకు సాక్షి కనపడకుంటుంది,

కనకపు సింహాసనంపైన శునకం తప్పుకుంటేనే అనుబంధానికి 

అర్ధం కుదురుతుంది..


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics