STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఎప్పటికీ

ఎప్పటికీ

1 min
398


వెన్నెలంటె తన నవ్వని చెప్పలేను ఎప్పటికీ..!

వేకువంటె తన పిలుపని చెప్పలేను ఎప్పటికీ..!


జాబిలంటి చిన్నదాని మనసు చిత్రమేల చిక్కు..!? 

పసిడియంటె తన సొగసని చెప్పలేను ఎప్పటికీ..!


పరిమళించు గంధాలను అలరించే కోమలిరో..!

చీకటంటె తన మధువని చెప్పలేను ఎప్పటికీ..!


సెలయేరుల ఈడు తెలుప తరమౌనే ఈ కనులకు..!?

కాలమంటె తన వయసని చెప్పలేను ఎప్పటికీ..!


విరహమెక్క డున్నదంటె వెతికి పట్టి చూపుటెలా..!?

గగనమంటె తన రూపని చెప్పలేను ఎప్పటికీ..!


ఆరాధగా ఉన్నదెవరు యుగాలుగ..!

వేణువంటె తన తనువని చెప్పలేను ఎప్పటికీ..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance