ఎంతదూరం
ఎంతదూరం


ప౹౹
ఎంతదూరం వలపు వాకిలికి ఎంతెంత దూరం
కొంతదూరం కొలుపు ఈడేరనూ కొంత దూరం ౹2౹
చ౹౹
వింత మోహం చింత తీర్చను సమయమైనది
సొంత దాహం సొగసు పెంచను సన్నద్దమైనది ౹2౹
కలదులే అనువైన కాలం ప్రేమలో కలుసుకోను
వలదులే వరసైన వాలకం మందే తెలుసుకోను ౹ప౹
చ౹౹
దూరాల ఎలమి తీరాలు చేరను ఎద సై అన్నది
భారాల బడలిక బంధాలు ముందూ ఎంతన్నది ౹ప౹
ప్రేమించేసి వయసు కూడ వరసలను పెంచినది
ఊహించేసి మనసు ముందే కలలను పంచినది ౹ప౹
చ౹౹
మానసానికెంతో మధురిమలే దూరాలే తరిగాక
సాహసానికెంతో సరదాలే సరసాలూ చెలరేగాక ౹2౹
వలపు వాకిలి తెరిచాక రాకపోకలూ రంజిల్లును
తలపు తాళం తమకంలో ఊహలతో వర్ధిల్లును ౹ప౹