ఎంత బాగున్నావో
ఎంత బాగున్నావో


ప౹౹
ఎంత బాగున్నావో మేఘాలలో తారకలా
ఎంత బాగున్నావో పాల మీగడ తరకలా ౹2౹
చ౹౹
పూవు పుట్టగానే అది పరిమళించినటులే
నీవు పుట్టాకనే అందం పరవశించే అటులే ౹2౹
ఎంత బాగున్నావో మేఘాలలో మెరుపులా
ఎంత బాగున్నావో తెల్లవారిన తూరుపులా ౹ప౹
చ౹౹
కలలోని ప్రేమ కళ్ళలోనే కనిపించినే చెలి
అలలోని అలజడిలా అనిపించెనే ఆ గిలి ౹2౹
ఏమా భయం ఎదలో విషయం వివరించ
లేమా జయం నీదేలే జన్మంత పలవరించ ౹ప౹
చ౹౹
కొసిరే ప్రేమకు కోరికలే తోడై తొందరచేయ
ముసిరే భ్రమకు కోరి కలే ముందరొచ్చేయ ౹2౹
జన్మ సాఫల్యం జరిగి తీరు ఆ కలయికలో
ఆజన్మ సఫలం అందివచ్చు కలసి రాకలో ౹ప౹