ఎన్ని రాత్రులు
ఎన్ని రాత్రులు
ఎన్ని రాత్రులు ఓడిపోతే ఉదయమై నే వెలిగినానో
ఎన్ని కలలవి రాలిపోతే కవనమై నే రగిలినానో
చిమ్మ చీకటి కమ్ముకుందని ఆగిపోతే గమ్యమెక్కడ
ఎన్ని మలుపులు అలసిపోతే గెలుపు నై నే మిగిలినానో
రెక్కలున్నా ఎగరకున్నా పంజరంలో పక్షి నైనా
ఎన్ని తలపులు తలుపు తీస్తే శిఖరమై నే ఎదిగినానో
లోకమంతా నిదుర పోతే మనసు అపుడే మేలుకొన్నది
ఎన్ని ఆశలు అస్త్రమైతే నన్ను నేనే గెలిచినానో
చేత కాదని చేవలేదను నుదుటి రాతను చెరుపు సత్యా..
ఎన్ని తపనలు తపములైతే నేను నేనై నిలిచినానో…

