ఎన్నెన్నో ఆశలు
ఎన్నెన్నో ఆశలు
ఎన్నెన్నో ఆశలు ఊహల్లో రెక్కలతో పయనం అనందం
ఏవేవో ఆశయాలు కలల్లో చుక్కల పల్లకి నందనం అనందం
ఎన్ని మాటలు చెప్పినా మాటమీద నిలబడితే అందం
గాలి మేడలు వొట్టి మాటలు నీటి మీద రాతలు చందం
బంధాల నడుమ బాధ్యత మరిస్తే ఏముంది
అభయం నోసగే భగవంతుని దీవెనే అసలు బంధం
పూల కొలువు దీరిన మహా పరిమళం వ్యాపించు
వీచే గాలి పరిమళం తెచ్చింది సుమ గంధం
ఎత్తు పల్లాలు దాటితే జీవితం సాఫీగా సాగుతుంది
ఆకాశం అంత ఎత్తు ఎదగడం నిజమైన గెలుపు సౌధం

