ఎందుకో
ఎందుకో
ఊహించని రీతిలో మలుపు జీవితం తిరిగింది ఎందుకో
కనిపించని హృదయ గాయం ఎదురు తిరిగింది ఎందుకో
ఆశలన్నీ అడియాశలు ప్రశ్నలే ఉత్పన్నం అవుతుంది ఎందుకో
గతం తీయని జ్ఞాపకమై మిగిలింది ఎందుకో
కాలం గడిచే కొద్ది మౌనం ఆశ్రయించింది ఎందుకో
చుట్టూ వున్న ప్రపంచం చిన్న బోయింది ఎందుకో
అందమైన భావం అంతరంగం కదిలించింది ఎందుకో
శ్రుతి తప్పిన జీవితం ప్రశ్నించింది ఎందుకో
మధుర స్వప్నంలో జీవితం అమృత గానం వినిపించింది ఎందుకో
మనస్సు పొరల్లో జ్ఞాపకాల పరిమళం చిగురించింది ఎందుకో.

