ఎందుకో యీ వేధన
ఎందుకో యీ వేధన
ఎందుకో యీ వేధన
చూస్తుండగానే కరిగి పోయే కాలంలో... మనం శాశ్వతం కాదని
తాత్వికత నెరిగినా.?
ఎందుకో యీ వేదన....?
వదలని నీడ అయి,
కలలో కలత అయి,
నీ చెలిమి జ్ఞాపకం వీడని
వీడని చందన బంధమై నాలో
కలిసిపోయినా....?
ఎందుకో యీ వేదన..?
నీ నియంత్రణ నాపై వొద్దు అనలేదు.. సూచించటం తప్పు కాదు... అందులో శాసించటo
ఉండరాదు అని మనసులో మాట పలికినా..
ఎందుకో యీ వేదన...
నీ మదిలో మర్మం ఏమిటో తెలియక... కాలానికి.. గేలం
వెయ్యలేక... ఏది సత్యం ఏది నిత్యం... అంటూ... భ్రమల తో, వ్యధల తో, తల్లడిళ్లు తున్న... నా మది లోచన నుండి..
నిన్ను విడవమని... అడుగుతూ ఎందుకో యీ వేదన...
అంతులేని.. ఆరాధన తో గతరుణమై.........
తిరిగి రాకోయి..... అనుకోని అతిధి

