ఎలా చెప్పను
ఎలా చెప్పను
ఎలా చెప్పను నా మనసు పలికే
మౌన భాష్యం నీ పేరే అని ఎలా తెలుపను
నీ పిలుపే ఓ ప్రేమ గీతం అని .......
ఎలా వివరించను నా హృదయం వెతికే రూపం నీదే అని......
ఆరాదించేది నిన్నే అని ఎలా చూపను
నా ఊహల్లో నేను ఆ రూపం కలల రూపమై
కన్నుల్లో నిండిపోని మనసంతా మురిసి పోని
పెదవిపై చిరునవ్వులా నిలిచిపోని

