STORYMIRROR

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

4  

VENKATALAKSHMI N

Fantasy Inspirational Others

ఎగరాలని వుంది

ఎగరాలని వుంది

1 min
185

నాకోసమే జీవించాలనుంది

ఆడపిల్లనే పంజరం నుండి

స్వేచ్ఛకు వేసిన సంకెళ్లను తెంచి

ప్రకృతిలో పచ్చని చిలుకలా

స్వచ్ఛమైన రెక్కలు తొడిగి

ఎగిరి పోవాలని వుంది

నాదైన ప్రపంచంలో

నాకై నేను వసించాలని

నా మనసులోని సంకుచిత

భావాల్ని ఉండచుట్టి గాలిలో

పతంగంలా ఎగరేయాలని వుంది

ముళ్ళకంపల చిక్కులను విప్పుకుని

విహంగంలా విహరించాలనుంది

గిరి గీసిన పరిధిని దాటి

హద్దులు లేని ఆనందంతో

గెంతులేయాలని వుంది

నాలోకి నేను తొంగి చూసుకుంటూ

నాకై నేనుగా నాతో నేను సాగుతూ

ఈ విశాల ప్రపంచంను

మరింత అందంగా ఆస్వాదించాలనుంది


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Fantasy