STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

4  

Midhun babu

Classics Fantasy Inspirational

ఎగిరెగిరి

ఎగిరెగిరి

1 min
3


ఎగిరెగిరి గిరికీలు కొట్టి ఎక్కడెక్కడ, చిక్కుకుంటుందో

 తెలియని గాలిపటం! 


గాలి వాలును బట్టీ వేగాన్ని మోస్తూ.. మబ్బుల్లోకి దూసుకుపోయెప్పుడు..

 దూకుడే తప్ప నిలకడ తెలియని.. అమాయకపు కాగితపు విహంగం! 


చెట్టుకొమ్మలు, కరెంటు కమ్మీలు.. పాపం, అడ్డగించే 

ఏ అవరోధాలూ గుర్తురావు! 


రెపరెపలాడే రంగులు, ఊగిసలాడే తోక.. రివ్వురివ్వున మేఘాల

 వైపు పయనం! 

నల్ల మబ్బునును సవాలు చేస్తూ, పిల్లమబ్బును హేళన చేస్తూ,

 తెల్లమబ్బును వెక్కిరిస్తూ.. చుక్కలకు పోటీ తానంటుంది! 


సాటి ఎవ్వరూ లేరనుకుంటుంది సూర్యుడు, చంద్రుడు, ఉరుములు, 

మెరుపులు అన్నీ ఉన్నా ఆకాశం తనకే హక్కని ధీమా! 


పిచ్చి పతంగానికి తెలియదు దారం తన కాధారం అనిఎగరేసే వారికి 

ఒడుపు తప్పినా, ఏ కొమ్మో అడ్డుపడి తాను చిరిగినా.. అక్కడితో 

కథ సమాప్తం అన్న వాస్తవం, తెలియని అమాయకపు గాలిపటం కథ.. 


హద్దు, పద్దు తెలియని ఆశల వయసుకో హెచ్చరిక నేస్తం! 

గమ్యం, గమనం తెలియని ప్రతి పయనం దు:ఖాంతమే!!!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics