ఏమన్నది
ఏమన్నది
పొంగి పొరలి పారేటి యేరు ఏమన్నది
నింగి నుండి కురిసేటి చినుకు మేలన్నది
ఉరిమి ఉరిమి గర్జించె మేఘమాల ఏమన్నది
రంగులతో విచ్చుకున్న హరివిల్లు మేలన్నది
కొండ కోన నడయాడు పిట్ట ఏమన్నది
హద్దు లేని జీవితమె ఎంతొ మేలన్నది
మిణుకు మిణుకు మెరిసేటి మిణుగురేమన్నది
చీకటిలో దారి చూపు నేను మేలన్నది

