ఏమని రాయను
ఏమని రాయను


ప౹౹
ఏమని రాయను అహా ఎలాగని రాయను
ఆమని ఊహను చేరలేదే ఏమని రాయను ౹2౹
చ౹౹
ఎద అయినా ఎందుకులే అని ఊరుకోదుగ
మొదలయిన మోహమేమో దగ్గరే రానీదుగ ౹2౹
కల అలికిడి కలతే పెంచి కవ్వించి పోవునూ
చెలి కలివిడి చెదిరి చెరిపిలే వలపపూవునూ ౹ప౹
వెలసిపోయాక వెన్నెల అందాన్ని ఏమని రాయను
అలసిపోయాక ఆదమరచి మనసు ఏం చేయును ౹2౹
కానరాని కవచమేదో గుడ్డిగా చేసేసి కప్పివేసెనుగా
కనలేని అవసరమే కలిగి కలవరమై మసెలునుగా ౹ప౹
అక్షరాలనే ఆకురాయిగా మలచుకొనీ మరీ
చక్షువులనే చకోరములా పిలుచుకొని కోరీ ౹2౹
అందమైన భావాలూ అధరాలతో సరిపోల్చ
సుందరమైన వలపు సునామి ఎదనే రగల్చ
ఏమని రాయనూ అహా ఎలాగని రాయను
ఆమని ఊహను చేరలేదే ఏమని రాయను ౹2౹