ఏమిటో నీ మాయ
ఏమిటో నీ మాయ
ఏమిటో ఈ మాయా వెన్నెలరేడా అందాల మామా
మాత్తుమందు చల్లుతావు మా మనసును దోచుకుంటావు
నీ వెన్నెలలో మలయ మారుత పవనాలు హాయి గొలుపు గిలిగింతల
సంబరాలు పడుచు జంటలను ఊహల పల్లకిలో ఊరేగిస్తావు
నిన్ను విడిచి మమ్ములను ఎక్కడికీ పోనీవు నీ వెన్నెల శాశ్వతం కావాలని తహతహలాడుతుంటే అమావాస్య చీకట్లు ముసిరేవరకూ మమ్ములను మరపిస్తావు
వెన్నెలమడుగులో జలకాలు ఆడిస్తావు వలపు మైకంలో నిలువునా ఓలలాడిస్తావు
చీకటి ముసిరినప్పుడు నిరాశలో మునుగుతాం మళ్ళీ వెన్నెల రాగానే దిగులంతా మరచిపోతాం కొత్త కొత్త ఊహలకు రెక్కలొచ్చి నింగిలో విహరిస్తాం
నీ కోసం పరితపిస్తూ ఎదురుచూస్తూనే ఉంటాం నీవు రానిరోజు పిచ్చివాళ్ళం అవుతాం విరహగీతాలు పాడుకుంటాం ప్రేమను పంచుతావు
రెండు మనసులు ఒకటి చేస్తావు నీ చల్లని వెన్నెల కిరణ కరణాలతో దీవిస్తావు మత్తుమందు జల్లుతావు మా అందరి మనసులు దోచేవు
ఏమిటో నీమాయా చక్కనివాఁడ వెన్నెల రేడా

