ఏమి కోరలేదు
ఏమి కోరలేదు


ప౹౹
ఏమి కోరలేదు ఎపుడు ఎదలోన చోటు తప్ప
భూమి ఆకాశం అడగలేదే చూపనూ నీ గొప్ప ౹2౹
చ౹౹
అడిగానని చేయకే అలుసూ ఆ అందంతోను
పొగిడానని పోనీ అనక కలిసిపో బంధంతోను ౹2౹
పూలరేకుల పూతరేకు చందమేలే ఆ అధరమే
కాలరేఖలే కల్పించవా అందుకోనూ ఆధారమే ౹ప౹
చ౹౹
నింగిలోని చుక్కలా నీలోనే ఏదో మెరుపున్నది
పొంగిపోయే పొంకానికి ప్రేమలో మరుపున్నది ౹2౹
ఎడదకు ఎంత కష్టమో ఆ ఎదురు చూపులూ
ఎడబాటు కలగనీకే ఎక్కుపెట్టేసేసి తూపులూ ౹ప౹
చ౹౹
కలవరమే కలిగించకు కాంక్షనే మరి నులిమేసి
కలా వరమే కలత తొలగనే మదిలో గాలమేసి ౹2౹
లేమితనం లేదులే ఎదలోని వలపునే పంచను
కామితనం కారణమూ అడగదులే ప్రేమించను ౹ప౹