ఏకాంతం
ఏకాంతం
విరిసీ విరియని అందమైన పూబాల
మనసును చేరిన సుమ పరిమళమా..
అలజడి రేపిన మదురోహల మత్తు లో
హృదయాని కైనా తీపి మధుర గాయమా....
విరబూసే వెన్నెల నవ్వుల వెలుగురేఖల
అధరాన విరిసిన మంజుల దరహాసమా..
ప్రశాంత దివ్య ప్రకంపనాలను
పరిచయం చేసిన ఆత్మీయ మృదు స్పందనమా....
నిర్మల ఏకాంత రసాస్వాదన లో
మదిలో మ్రోగిన మోహన రాగమా..
శబ్దం లో నిశబ్దం తాండవించు గుండె గదిలో
వెలుగు ప్రభను పరిచయం చేసిన చైతన్యమా....
నిశి రాతిరి తారక ఎన్ని అడిగినా
చెప్పలేని కనుల నిండిన రూపమా..
నా మది నిండిన ఓ ప్రేమ భావమా
ప్రేమతో వలచిన వలపు గెలుపులా నవ్వి పో....

