STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

ఏ పూవును కోయలేను

ఏ పూవును కోయలేను

1 min
2


ఏ పూవును కోయలేను..ప్రేమకు బలి చేయలేను..! 

పెదవి అసలు విప్పలేను..విరహగీతి పాడలేను..! 


గుండెసడిని నిలిపిరెవరు.. కనుపాపల నిలచిరెవరు..

బొమ్మగీసి చూపలేను..రాయిపైన చెక్కలేను..! 


చేతగాని తనమేగా..కలవరమై మిగిలేది.. 

కలను కలగ తెలియలేను..నిజమేదో అందలేను..! 


ఆనందం లేనిచోటు..ఉందంటే సబబెట్లా.. 

విచారమా నిలుపలేను..విచారణా చేయలేను..! 


ఇది నేనని అది నీవని..గుర్తెరిగే విధమేదో..

వింతగొడవ ఓపలేను..సొంతమేదొ ఎరుగలేను..! 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance