ఎదురు చూపులు..
ఎదురు చూపులు..
అలసిపోయిన కనులకు
నీ చూపులతో వెలుగునిచ్చావు...
సొలసిన మనసుని
నీ నవ్వులో ముంచావు...
ఆ చూపుల వెలుగులలో చూశాను
కోటి కాంతుల రూపాన్ని...
ఆ నవ్వుల మాయలో చూశాను
నను మరిపించే హొయలను...
నీ పిలుపొక మధుర గీతం...
నీ మనసొక మధుర కావ్యం...
ప్రతి నిత్యం నీవెదురైతే
ఆ ప్రతి క్షణం నిను చూస్తూ
నువు లేని ప్రతి నిమిషం నిను ధ్యానిస్తూ
నేనుండిపోనా నీ దాసుడినై..

