ఎదురు చూపులో
ఎదురు చూపులో
ఎదురు చూపులో
పదే పదే నీ తలపే
నా మదిని అది తొలచే
నీ నవ్వే నా హృదిలో పూలై పూసే
కరువాయే కంటీకి కునుకే
కలవరింతలో నీ ఊసే
నీ జతనే నా మనసు మరీ మరీ కోరే
నను నీవు వీడిన ఆ ఊహే
మౌనంగా కలిచివేస్తుంది నీ దిగులే
నా ధ్యాసంతా నీ ఎదురుచూపులోనే
అను క్షణం నీకై నిరీక్షణే
అలుపే రాదు నీ సమక్షమే
వేచి చూస్తున్న ఆశతో నీ దర్శనమే
నీవు లేని నా జీవితం ఇక వ్యర్థమే
నా మనసెరుగది నీ మరుపే
నీకై తపిస్తూ ఎరుగను అసలే అలుపు !!

