STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

ఎడారిలో నా పయనం

ఎడారిలో నా పయనం

1 min
0


 ఎడారిలో నా పయనం ఏ గాయం కొత్త కాదు 

 అనాదిగా అదే రణం పోరాటం కొత్త కాదు 


 ఇప్పుడున్న ఈ కష్టం ఎందుకంటె ఎలా చెప్పు

 మరల మరల పుడుతుంటే ఏ మరణం కొత్త కాదు 


 నిన్ను నీవు మలచుకున్న దారి మరచిపోయావా 

 నిప్పులపై నడిచావే ఆ మార్గం కొత్త కాదు 

 


 అంధకార బంధురమై తోస్తోందా భవితవ్యం 

 వెలుగు కొరకు చీకటితో సావాసం కొత్త కాదు 


 దారంతా ముళ్లేనని పరుగాపకు ఓ సత్యా…

 గుండెపిండు నీ కథలో ఏ గరళం కొత్త కాదు 


 


Rate this content
Log in

Similar telugu poem from Classics