STORYMIRROR

Dinakar Reddy

Abstract Inspirational

4  

Dinakar Reddy

Abstract Inspirational

దివ్య కార్తీకం

దివ్య కార్తీకం

1 min
643

తెల్లవారక ముందే నిద్ర విడచి

చన్నీటి స్నానాలు చేసి

కార్తీక దామోదరుని మదిని తలచి

వెలిగించేము కార్తీక దీపం


అదిగో ఆకాశ దీపం

ద్వాదశి దీప దానం

విశిష్టత కలిగిన సాలిగ్రామ దానం

కార్తీక పౌర్ణమి రోజున జ్వాలా తోరణం

శివ విష్ణు ఆలయాల్లో చేసే సందడి

విశేషమైన కార్తికేయుని ఆరాధనలు

తులసి కోట చుట్టూ దీపాల మాలికలు


ఓ వైపు శరణం అయ్యప్పా అనే శరణు ఘోషలు

ఆధ్యాత్మికత పెంచు పురాణ ప్రవచనాలు


ఆరిపోయిన దీపాలను కూడా వెలిగించమంది

అంటే నిస్ప్రుహను దరి చేరనీయవద్దని చెబుతోంది

దానం చేయమంటోంది

లోభాన్ని దూరం చేసుకొమ్మని చెబుతోంది

కార్తీక దీపం వెలిగించమంది

ప్రకృతిలోని ప్రతి ప్రాణి స్థితినీ గుర్తించమంటోంది


అరిషడ్వర్గాల చీకట్లను పారద్రోలి

నీ మనసులో కరుణను నింపి

వెలిగించు కార్తీక దీపాలను

తెలుసుకో జీవిత పరమార్థమును


(దీపంతో మరో దీపం వెలిగించినట్లు

ఒకరికొకరు తోడుగా నిలిచి సమస్యల చీకట్లు తొలగించు)


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract