దినకరుడు
దినకరుడు
ఆస్తికులకు ప్రత్యక్ష దైవం
నాస్తికులకు ఒక గోళం
నీవు లేక పోతే సృష్టి శూన్యం
నీ వెలుగే అందరి ప్రయాణం
తూరుపు ఉషోదయ కిరణాలతో
మొద్దు బారిన మస్తిష్కాలను
తట్టి లేపే ఉదయభానుడవు
సకల మానవాళికి
ఆరోగ్య ఐశ్వర్యాలను
ప్రసాదించు సూర్య'భగవానుడవు
ఏడు గుర్రాల వెక్కి
ఏడేడు లోకాల ను పాలించి
కాలచక్రము చేతబట్టి
నడిపించు దినకరుడవు
సకల జీవుల కు
భుక్తిని ప్రసాదించుటకై
అలుపెరుగక విరామమివ్వక
సంచరించు నిత్య కృషీవలుడవు
సకల ప్రాణుల కు
ఆయుష్షు నిచ్చి
సతతము నడిపించు
తేజోమయానివి నీవు
