దీపమే నీవు
దీపమే నీవు
నా గుండె చప్పుళ్ళ..కావ్యమే నీవు..!
నా కొఱకు అందాల..గగనమే నీవు..!
నేనేలు కొందునా..ప్రియమార ఇపుడు..
నా పసిడి చేమంతి..రాజ్యమే నీవు..!
నిను నన్ను విడదీయు..శక్తియే లేదు..
నా ప్రేమ అద్దాల..లోకమే నీవు..!
ఆటలో పాటలో..నువులేక ఏల..
నా మాట తోడున్న..మౌనమే నీవు..!
మన చెలిమి సాక్షిగా..ఉన్నదే శ్వాస..
నా ఊపిరింటిలో..దీపమే నీవు..!

