సిరులిచ్చు శ్రీమహాలక్ష్మికి
స్వాగత హారతులిద్దాము,
దివ్య దీపావళిని
ఆనందకేరింతలతో ఆహ్వానిద్దాము.
అలుపెరుగని జీవనగమనంలో
తూచలేని ప్రేమకాంతులనే దీపావళిగా చెప్పుకుందాము,
కలతనిద్రలులేని సంతోషసంపదే దీపావళి లక్ష్మీగా భావిద్దాము,
మమతలు పంచు ఆత్మీయతలే
ముచ్చటైన దీపావళిగా చెప్పుకుందాము,
వెలుగుదివ్వెల
ఇంటి ఆడపడుచు చిరునవ్వే
దీపావళి లక్ష్మీశోభగా తలుద్దాము.
నర అసురత వధియించే దేవుడికి
అధర సుధలతో హృదయాన్ని అర్పిద్దాము,
అశ్రువుల బాటలో
అనురాగమై వెంటనిలిచే
అనుబంధాన్ని
వరముగా ఇవ్వమని
దేవుడిని ప్రార్ధిద్దాము,
కఠిన కాలంలోనూ
మంచి నడతను వీడని విశ్వాసాన్ని సిరులుగా కోరుకుందాము,
చీకటిలో వెలుగులు పంచే
ఆశయదారులే లోకానికి
కానుక కావాలని వేడుకుందాము,
ఆకలి దప్పులు తీర్చేటి
పచ్చదనపు ప్రకృతినే
దేవుడి రూపంగా భావించి పూజిస్తూ
నిత్య దీపావళి జరుపుకుందాము.