డిసెంబర్ 28th..
డిసెంబర్ 28th..
ఓ..విజ్ఞాన శాస్త్రమా!
అణువు నుండి అణుబాంబు వరకు
కణం నుండి కాయం వరకు
బిందువు నుండి సంద్రం వరకు
రేణువు నుండి వీచే వాయువు వరకు
చినుకు నుండి సునామీ వరకు
మంచుబిందువు నుండి మంచు కొండల వరకు
అందుగలడు ఇందు లేడన్న సందేహము వలదు
అన్నట్టు అంతటా నీవే గా ..
ఓ విజ్ఞాన శాస్త్రమా!
జలము నందు..హలము నందు
దళము నందు ఫలము నందు
బలము నందు తలము నందు
చలనము నందు.. జ్వలనము నందు
నేల యందు..నింగి నందు
ఇలా విశ్వంలో..
ప్రతి అణువులో..అడుగడుగునా
అడుగు పెట్టిన ... ఓ విజ్ఞానమా
నీవు లేని...నాడు
మానవ జీవితానికి అర్థం లేదంటే..
అతిశయోక్తి కాదేమో
ఓ..విజ్ఞాన శాస్త్రమా...
నీవందించే...విజ్ఞానాన్ని
సద్వినియోగ పరుచుకునే
విజ్ఞతను... మాకందించి
మానవాళి శాంతి సౌభాగ్యాలతో
వర్ధిల్లాలని శుభాశీససులు అందిచు తల్లీ
.......రాజ్.....
