STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

చూసిన క్షణానా...

చూసిన క్షణానా...

1 min
334

నిను చూసిన క్షణానా నిదురిక రాకుండా పోయింది

నేను నా మానానా ఉందామంటే లేకుండా అయింది

మనసంతా ఒకటే గుబులుతోనే మసకేసి పోయింది

ఇసుమంతా తీరికలేని తిరునాళ్ళ బ్రతుకు అయింది

నిను చూసిన క్షణానా నిదురిక రాకుండా పోయింది

నేను నా మానానా ఉందామంటే లేకుండా అయింది

గుడికెళ్ళి వస్తావుంటే గుండెల్లోకి చూపులే దించావు

ఓడి మళ్ళి ఒడలంతా వయ్యారాలే కట్టేసి ఉంచావు

గుడికెళ్ళి వస్తావుంటే గుండెల్లోకి చూపులే దించావు

ఓడి మళ్ళి ఒడలంతా వయ్యారాలే కట్టేసి ఉంచావు

వింత పులకింత విషయమేమిటో చెప్పి పలకరించే

కొంత సవరింత జాగునే చేసి జవరాలికై పలవరించే

చెప్పలేక చేకౌగిలి చెలియ వలపుకై చేరిచేరినే చెంత

దప్పికలేని దాహం దరిచేరి దరహాసమాయెనే వింత

తనకుమాలిన ధర్మం తమకమాయెనే తరలించకనే

తనువుపాలిట ఒక తాండవమాయెనే వివరించకనే

నిను చూసిన క్షణానా నిదురిక రాకుండా పోయింది

నేను నా మానానా ఉందామంటే లేకుండా అయింది

మనసంతా ఒకటే గుబులుతోనే మసకేసి పోయింది

ఇసుమంతా తీరికలేని తిరునాళ్ళ బ్రతుకు అయింది

ఊగిసలాడే ఊహలే ఉరుకులెత్తెనే నిలిచి ఉండలేక

సొగసులాడి సరసమే సన్మోహనం పెంచే ఉండిపోక

ఊగిసలాడే ఊహలే ఉరుకులెత్తెనే నిలిచి ఉండలేక

సొగసులాడి సరసమే సన్మోహనం పెంచే ఉండిపోక

నిను చూసిన క్షణానా నిదురిక రాకుండా పోయింది

నేను నా మానానా ఉందామంటే లేకుండా అయింది

నిను చూసిన క్షణానా నిదురిక రాకుండా పోయింది

నేను నా మానానా ఉందామంటే లేకుండా అయింది

Rate this content
Log in

Similar telugu poem from Romance