చూసానూ..
చూసానూ..


ప౹౹
రెప్ప వేయక చూసానూ రెట్టించినా అందాన్ని
చెప్పలేని హాయేదో చేరినే చూశాక చిన్నదాన్ని ౹2౹
ప౹౹
చూపుల తూపులతో తనువులోన తన్మయం
మరుల మారాముతో మనసులోన విస్మయం ౹2౹
ఎడారిలో వెల్లువలే ఎడదలో ఏదో సంచలనం
తడారిన గొంతుకకు చన్నీరే తాకినట్లు చలనం ౹ప౹
చ౹౹
పచ్చి యవ్వనపు పరవళ్ళు వరద వరవళ్ళేగా
మచ్చికలేని ఆ వయసు పొంగుకు పరవళ్ళేగా ౹2౹
కవ్వించే అందానికి ఆసరాగ చేరే ఆ హాసనమే
ఊహించే ముందుగ కోరినే ప్రేమ సింహాసనమే ౹ప౹
చ౹౹
చిరువేణి కులుకుతో చిగురేసే వంతగా వలపు
చిగురుబోణి చెంత చేరినట్లుగ మదిలో తలపు ౹2౹
ఎలమి చూపులలో చిక్కిన చక్కనైన తరుణిని
చెలిమి చేతులలో చేర్చుకోనా ప్రణయ వాణిని ౹ప౹