STORYMIRROR

Praveena Monangi

Romance

4  

Praveena Monangi

Romance

చూపులు

చూపులు

1 min
373

తొలి చూపులో నిను నేను సరిగా చూడలేదు ,

మలి చూపులో చూద్దామని కనుపాప కదిపితే నీవు నన్నే చూస్తున్నావు,

నును సిగ్గుతో తల దించాను,

నీ సమ్మోహనశక్తి నా మనసుని ఆకర్షించింది ,

స్థిర ముద్ర పడింది,

ఏది చూసినా,ఎటువైపు చూసినా నీవే,

ఎదంతా నీవే,

చిరు చూపుతో చేసుకున్నావు,

నా హృదయాన్ని సొంతం.

అభినయ నయనాల సోయగాడ ,

చిరుచూపు ముసిముసి జల్లువాన కురిపించావు,

నా ఎద తడిసింది ఆ వానలో,

నీ త్వరితానికి తబ్బిబ్బింది నా స్వాంతనము,

నీ నగుమోము ,చిరుదరహాసం,

ఉప్పొంగించింది నా మనసును,

నాలో రేగే భావాల ఆనకట్టవు నీవు,

నా ఆశల కెరటాలలను దరిచేర్చుకునే ఒడ్డువి నీవు,

నీవు ఎదుట పడితే నా మది లయ తప్పుతుంది

నీవు కనుమరుగైతే నా కలము కదలదు

నీ ఆశాకుసుమాల మాలలో 

నేను దారమవుతాను,

నీ వేణువులో రాగాన్నై ఉప్పొంగుతాను,

నీ నయనాలలో దీపాన్నై వెలుగుతాను,

నీ హృదయములో శ్వాసనై నిలుస్తాను,

నీ అడుగులో అడుగునై నడుస్తాను,

మన ఊహల సరిగమల పల్లకిని 

పదనిసల శ్రీకారం చేద్దాము


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance