STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

చూపులప్రియా జాబిలి

చూపులప్రియా జాబిలి

1 min
294


చూపులతో ప్రియజాబిలి..పాడిందొక నవరాగం..!

అరవిరిసిన నెలవంకై..విసిరిందొక నవహాసం..! 


పలుకుతేనె ధారలలో..సౌదామిని తానేలే.. 

మదినేలే పరిమళమై..నింపిందొక నవభావం..! 


కవనారుణ తేజానికి..నిత్యదీప సుందరియే.. 

అంతరంగ నాట్యానికి..పొదిగిందొక నవతాళం..!


అనుభవాల తెఱచాటున..దివ్యశక్తి రూపసియే.. 

కలలు నిజం చేసేందుకు..నిలిపిందొక నవరాత్రం..! 


పొగడగాను భాషలేని..లిపియెలేని సొగసరియే.. 

బీజాక్షర సాక్షిగాను..చూపిందొక నవగాత్రం..! 


ఒక లేఖను వ్రాయలేని..తనమేగా అసలుప్రేమ.. 

చూపరాని చిత్రకథను..చేసిందొక నవకావ్యం..! 


మరిమాధవ గజల్ వాణి..తానేనని చెప్పాలా.. 

చైతన్యపు గగనాలకు..వేసిందొక నవమార్గం..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance