చూపులో..
చూపులో..
చూపులో దాగిలేదా చూడగలేని శృంగారం
రూపులో చేరిలేదా వెలకట్టగలేని బంగారం
వాడుకలో వలపు కూడ నిత్యావసరమేగా
కూడికలో చూడ కూర్పు సైతం సరసమేగా
పూల అందం పరిమళించి పక్వమాయెను
గాలి గంధం గమనించి ఇక ఐక్యమాయెను
మౌనమేలా మనసులోని మాట తెలుపను
ఘనమేలే ఆ వరసతెలిసి తనువే కలపను
చూపులో దాగిలేదా చూడగలేని శృంగారం
రూపులో చేరిలేదా వెలకట్టగలేని బంగారం
ఆకాశమూఎంత విశాలమో గమనించావా
అవకాశమే ఇంతచిన్నది అని తిలకించావా
కోరికలు కొత్తవేమికాదు మరల ఆలకించనే
చేరికలు అదనం అనుభవాలూ పలికించనే
గురిని తప్పించక మదిలో గుర్తువై మిగలవే
గురువులే ప్రేమలో లేరని వదిలేసి పోగలవే
ఆకాశమూఎంత విశాలమో గమనించావా
అవకాశమే ఇంతచిన్నది అని తిలకించావా
కోరికలు కొత్తవేమికాదు మరల ఆలకించనే
చేరికలు అదనం ఆ అనభవాలే పలికించనే
విరబూసిన చూపులనూ విడదీయకే మరి
అరవిరిసిన ఆత్మీయతనే అందుకోవా కోరి
విరబూసిన చూపులనూ విడదీయకే మరి
అరవిరిసిన ఆత్మీయతనే అందుకోవా కోరి
చూపులో దాగిలేదా చూడగలేని శృంగారం
రూపులో చేరిలేదా వెలకట్టగలేని బంగారం
వాడుకలో వలపు కూడ నిత్యావసరమేగా
కూడికలో చూడ కూర్పు సైతం సరసమేగా

