Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ఈవని రవిశంకర శర్మ

Romance

4.5  

ఈవని రవిశంకర శర్మ

Romance

చూపుల లేఖలు

చూపుల లేఖలు

1 min
332


నీ కళ్ళు సూదంటురాళ్ళా నన్ను ఆకర్షించాయి .

రేయంతా నిదురను దూరం చేశాయి .

అజంతా శిల్పంలా నీ రూపం అతి సుందరం .

వయ్యారాన్ని ఒలికించే తీరు సుమనోహరం .

నేను నచ్చాననే తదేకంగా నాకేసి చూస్తున్నావ్ .

అందరు మెచ్చుకుంటారనే కళ్ళు పెద్దవి చేస్తున్నావ్ .

మంచి తరుణమని కనుబొమ్మలూ ఎగరేస్తున్నావ్ .

నా స్పందనకోసం రోజూ ఎదురుచూస్తున్నావ్ .

ఎవరైనా చూస్తున్నారేమోనని

కళ్ళను గుండ్రంగా అటూఇటూ తిప్పుతున్నావ్ .

రారమ్మని , కబురులెన్నో చెప్పమని

ఆ కాటుకనద్దిన కనురెప్పలను కదుపుతున్నావ్ .

వాలుకళ్ళను వినయంతో వాల్చినా ,

పైటకొంగును తెరచాపలా మార్చినా

ఎంతో అందములే . సుమగంధము వీచునులే .

నాకోసమే పుట్టావా ఓ వగలాడీ ...

కవ్వించి కౌగిట్లో కాపురమే చేస్తావా కన్నెలేడి !

నీవు గొల్లభామవైతే నేను గోపాలుడను .

కొలనులోని కలువభామవైతే చందురుడను .

రాజసౌధంలోని రాణివే ఐతే నీ సిరికే సరిజోడును .

నీవు ఏమైనా , సదా నిన్ను కొలిచే పరమభక్తుడను .

నీ ప్రేమకు పాత్రుడను . నా ప్రేమను వరమిస్తాను .

నీకోసం ఏ క్షణమైనా పరితపిస్తాను .

నీ కన్నులతోనే నేనీలోకాన్ని చూసి తరిస్తాను .



Rate this content
Log in

Similar telugu poem from Romance