STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

చూపు కొరకు

చూపు కొరకు

1 min
3

చూస్తున్నా వేయి కనుల నీ చల్లని చూపు కొరకు..!

మోస్తున్నా విరహాలను..నీ వెచ్చని పిలుపు కొరకు..!


సెలయేరుల పాటలలో..కరగిపోవు శిలనౌతూ..

దాస్తున్నా కవితలనే..నీ వాడని నవ్వు కొరకు..!


పాలరాతి శిల్పాలకు ప్రాణమేల పోస్తావో..?!

లేస్తున్నా ప్రతి ఉదయం..నీ తియ్యని వలపు కొరకు..!


నీలి మబ్బు ఆరాటం..నీవేగా మాన్పగలవు..!

వ్రాస్తున్నా తెలియకనే..నీ వీడని మెరుపు కొరకు..!


అలల కాలి అందెలలో..నినదించే నెరజాణా..!

వస్తున్నా పావురమై..నీ చిక్కని పలుకు కొరకు..!


Rate this content
Log in

Similar telugu poem from Romance