STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

చూపాలట

చూపాలట

1 min
3



మదికమ్మిన సిగ్గుపూల..వానెవరికి చూపాలట..!? 
చిలిపివలపు గాలిపాట..వేదనెలా పాడాలట..!? 

మంత్రించే చూపులతో..తను వెనుకే ఉన్నాడే.. 
పెదవులింటి అలజడికో..రూపమేమి చెక్కాలట..!? 

ఇచ్చేందుకు అదుపులోన..లేనిమనసు ఏమైనదొ.. 
అనుతాపపు నీడలలో..ఏ తీరుగ కదలాలట..!? 

ఈ నేనుకు బోధపడని..సంగతులకు అంతులేదు.. 
కలలవీధి దీపాలకు..వెలుగులేల నింపాలట..!? 

జరుగుతున్న నాటకాన్ని..చూడలేని తనమదేల.. 
ఈ శ్వాసలతో"రణమే..ఇపుడెలాగ బ్రతకాలట..!? 

ఎడారిలో పారిజాత..సుమరాశిగ మనసైనది.. 
నీ పదముల అర్చనలో..ఇంకెలాగ ఉండాలట..!? 


Rate this content
Log in

Similar telugu poem from Classics