చలికాలం
చలికాలం
చైతన్యపు శక్తి సరిగ..అందవచ్చు చలికాలం..!
'శ్వాస మీద ధ్యాస'సరిగ..పెట్టవచ్చు చలికాలం..!
ఆహారపు వ్యవహారం..తగ్గించగ కుదిరేనోయ్..
అంతరంగ వ్యాపారం..జరుపవచ్చు చలికాలం..!
గదిని దాటి విహరించే..పనికి స్వస్థి చెప్పవచ్చు..
వ్యాయామం ఎంతైనా..చేయవచ్చు చలికాలం..!
మంచుపూల చెలినవ్వే..కంబళికద గమనిస్తే..
పలుకుతేనె తీపిపొందు..పొందవచ్చు చలికాలం..!
తలపులందు వెచ్చదనమె..తోడుంటే చాలంటా..
మనసుగోడు మొదలంటా..కాల్చవచ్చు చలికాలం..!
ఆశల హారతి పట్టగ..చక్కని తరుణం నేస్తం..
ఎఱుకగ లోపలి వేడుక..చూడవచ్చు చలికాలం..!
