STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

చివురించిన స్నేహం

చివురించిన స్నేహం

1 min
5


చివురించిన స్నేహంలో వలపు పెరిగి పోతున్నది

ప్రణయానికి చోటిస్తూ వయసు మురిసి పోతున్నది


చోటిమ్మని అడగలేదు చొరవిమ్మని కోరలేదు

ప్రేమవేల్పు కరుణిస్తే గతము మరిచి పోతున్నది


తన చల్లని స్పర్శతోటి కనులకాంతి పెరిగెనులే

కొలనులోని కలువలాగ సొగసు తడిసి పోతున్నది


పన్నీటిని కురిపిస్తూ పరవశింప జేస్తావే

ప్రాణంలో ప్రాణంగా తలపు నిలిచి పోతున్నది


అనురాగపు లతలునేడు అల్లుకునెను పొదరిల్లును

అనుబంధపు లోగిలిలో బతుకు వెలిగి పోతున్నది


తనువంతా విచ్చుకున్న సుమాలన్ని నీ కొరకే

తుమ్మెదవై నీవొస్తే మనసు కరిగి పోతున్నది


ఇన్నాళ్ళకు వచ్చెనులే శుభగడియలు ఓ వసంత

మౌని లాంటి నా హృదయం వశము తప్పి పోతున్నది


          


Rate this content
Log in

Similar telugu poem from Romance