చివరి పేజీ...శ్రీనివాస భారతి
చివరి పేజీ...శ్రీనివాస భారతి


కాంక్ష లేకుండా
సోదర ప్రేమ
హార్మోన్ల ఉత్తేజం
ప్రేయసి ప్రేమ
కడుపు తీపి
తల్లి ప్రేమ
సున్నిత దండన
తండ్రి ప్రేమ
వాత్సల్య శిక్ష
గురువు ప్రేమ
బ్రతుకు పాఠం
..గతితప్పితే
ఏదో ఒక ఆశ్రమం
ఆశ్రయం కాక తప్పదు
జీవిత పుస్తకంలో
చివరి పేజీని
ఎలా నింపుకోవాలో
ఎవరికి వారే
నిర్ణయించుకోవాలి..మరి!
--------///////////////---------