STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4.4  

Ramesh Babu Kommineni

Romance

చిత్తజల్లు

చిత్తజల్లు

1 min
35


ప౹౹

పొంచిచూసావ పొటమిరించిన అందాన్ని 

పంచి ఇవ్వాలని మనసులో అరవిందాన్ని ౹2౹


చ౹౹

గాఢమైన ప్రేమ గమ్మర్తులే చేసి చూపును

గూఢమైన మదిలో గుట్టుగానే నిలుపును ౹2౹

కలి మాయ కమ్మేసి ఎడదనేదో కలుపును

ఆకలిదప్పులను వదిలేసి ఆదమరుచును ౹ప౹


చ౹౹

గుర్తుండిపోయేలా గుండెల్నిగురిచేయాలి 

వచ్చుండిపోయేలా వలపునే సరిచేయాలి ౹2౹

నికరమైన ప్రేమకే నిలువెత్తు హారతులిచ్చి 

కనికరమే చూపు కొత్తప్రేమల కానుకలిచ్చి ౹ప౹


చ౹౹

కళ్ళతో కట్టేసెయ్ కనికట్టునే కామించనూ

ఒక్కళ్ళతో పంచుకో ప్రేమను ప్రేమించనూ ౹2౹

కొత్తకోరికల్ని మనసులోకి ఎగుమతిచేయి 

చిత్తజల్లై కురవ ప్రేమనే అనుమతించేయి ౹ప౹



Rate this content
Log in

Similar telugu poem from Romance