STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

4  

Midhun babu

Classics Fantasy Inspirational

చిత్రం విచిత్రల లోకం

చిత్రం విచిత్రల లోకం

1 min
3


చిత్ర విచిత్రాల లోకమిది 

కష్టాన్ని ఇష్టపడని బుద్ధి మనది 

నవ చైతన్యపు హృది మాత్రం లక్ష్యసాధనకు అవటితనం అడ్డు కాదంటున్నది.


ఎగిసిపడే కెరటం వానచినుకై రాలితేనే శుభమన్నది 

విధివ్రాతలోని లోపాన్ని అవకాశంగా మలచుకోవడమే ప్రజ్ఞన్నది,

ఊహలతో తనువంతా నింపేస్తే 

మాట వినని మనసే 

ఆకాశంలో విహరిస్తుంటుంది,

బలహీనతే చైతన్యపు విరోధైతే 

ప్రళయాలను ఆపగలిగే మార్గం కనపడకుంటుంది,

శంకాలను తొలిగించుకుంటూ సాగితేనే 

పట్టుదల ఆత్మవిశ్వాసమే ముళ్ళబాటను 

పూలబాటగా మార్చుతుంది.


బద్ధకం పెరిగిన తనువుకు 

విరహ వేదనే ఆభరణమౌతుంది,

బాధలకు తలవొగ్గని మేను 

ఆఖరి శ్వాస వరకు అశ్రువులనే రాల్చనంటుంది,

నిన్ను నీవు నమ్ముకొని 

శ్రమతో కోర్కెలు సాధిస్తే 

వన్నె తగ్గని పసిడే నీరూపంలో కనిపిస్తుంటుంది,

సుఖాల పంజరంలో బ్రతుకును గడిపేస్తే 

కాలమే ప్రగతికి తాళం వేస్తుంది,

నిన్ను నీవు తెలుసుకుంటే 

ఉదయించే తూరుపు కిరణమే 

నీ రూపుగా కనిపిస్తుంది.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics