STORYMIRROR

Midhun babu

Classics Fantasy Inspirational

3  

Midhun babu

Classics Fantasy Inspirational

చిత్రము కద

చిత్రము కద

1 min
3


మాయలోన ముంచెత్తుతు..మరపింతువు చిత్రము కద..!

స్వరధారల రుతుశోభల..అలరింతువు చిత్రము కద..!


స్వప్నకాంతి లోకాలను..త్రిప్పి చూపు చిద్వాణీ..

మోహాలను గమనిస్తూ..అణగింతువు చిత్రము కద..!


అనుభవాల కావ్యమైన..నిను చదువుట కుదిరేనా..

మోయలేని రాగాలను..వదిలింతువు చిత్రము కద..!


మధుమాసపు కోయిలలా..మనసుతోట నేలేవే..

ఎదలోయల మౌనాలను..పలికింతువు చిత్రము కద..!


సరసవీణ గుండెలయకు..చిరునవ్వులు పొదిగేవా..

అమృతమధుర భావనలను..ఊరింతువు చిత్రము కద..!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics