చిత్రాల పెట్టెలో ప్రేమ
చిత్రాల పెట్టెలో ప్రేమ
ప్రియా నాప్రియా,
ఎందుకు నీవు ఇందులో దాగావంట,
నీవస్తేనే నాకనులకు వెలుగంటా,
చిత్రాల పెట్టెలో చిత్రంగా దూరావంటా,
చికాకులతో మనకు చెలిమెందుకంటా,
కదలకుండా ఉన్నావో
చిత్రాలపెట్టె చెత్తబుట్ట చేరునంటా.
మొద్దునిద్రలో వున్నావంటే
సరసానికే దూరమౌతావంటా,
మూర్ఖపు చేష్టలతో అలిగావంటే
చిరునవ్వులే మరిచేవంటా,
కోపంతో కనపడక వున్నావంటే ఆశలే అవిరౌనంటా,
చిత్రాలపెట్టెను వీడకున్నావంటే
మారిపోవు దాని రూపురేఖలంటా,
నీళ్లలోన ముంచేసి పెట్టెను
నిను నిద్రలేపుతానంటా,
మౌనం మాటు అలకను తీర్చ
అరుగు బండలపై పెట్టెను బంతాట ఆడిస్తానంటా,
కోపతాపాలు తీర్చ
పెట్టెను
చెట్టుకు కట్టి ఊయలే ఊగుతానంటా,
ఆవిరవ్వని ఆశగా ఎదుటనిలిస్తే
చిత్రాలపెట్టేతో పని నాకేంటంట

