చిరునవ్వు నీది
చిరునవ్వు నీది
పువ్వులకు నవ్వులు అద్దే చిరునవ్వు నీది..!!
కనులకు కలలను తెచ్చే చూపులు నీవి..!!
సౌందర్యానికి అలంకరణ నేర్పే సోయగం నీది..!!
చినుకులకు నాట్యం నేర్పే నడకే నీది..!!
సాంప్రదాయనికే సరిగమలు నేర్పే చీరకట్టు నీది..!!
ప్రేమకు వైభవాన్ని కూర్చే దైవత్వం నీది..!!
కాలానికే ప్రేమను నేర్పిన తత్వం నీది..!!
కవి కలానికి కళలను అద్దే అందం నీది..!!
అందుకే నా మనసు నీది..!!
నా గుండె గది నీది
అతివ మనుగడ లేకుంటే సృష్టికి అర్థమేది..!!??

