STORYMIRROR

Midhun babu

Romance Classics

3  

Midhun babu

Romance Classics

చిరునవ్వే

చిరునవ్వే

1 min
3


ఆనందపు సామ్రాజ్యం..నీ చెరగని చిరునవ్వే..!

పంచదగిన ధనమంటే..నీ తియ్యని చిరునవ్వే..!


దాచుకోకు గుండెచాటు..ఎవరిపైన వ్యతిరేకత..

అమృతసమం ఏదంటే..నీ మాయని చిరునవ్వే..!


మాయచేయు లోకమేది..లేదు చూడు గమనిస్తే..

కపటమింత లేనిదంటె..నీ వెచ్చని చిరునవ్వే..!


అందరిలో అన్నిటిలో..ఉంది కదా దైవత్వం..

చెలిమిపూల తోటంటే..నీ చెదరని చిరునవ్వే..!


పరిమళించు మల్లియలా..ఉండుమనసె మనసంటే..

పల్లవించు వెలుగంటే..నీ కమ్మని చిరునవ్వే..!



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance