Midhun babu

Romance Classics Fantasy

2  

Midhun babu

Romance Classics Fantasy

చిన్నదైనా

చిన్నదైనా

1 min
2


నషాలాన్ని అంటుతుంది మిరియం చిన్నదైనా 

నోరంతా పండుతుంది విడియం చిన్నదైనా 


ఆకారం కాదుముఖ్యం ఉపకారం చేయాలి 

వెలుగెంతో పరుస్తుంది దీపం చిన్నదైనా 


కడివెడన్ని పాలల్లో చల్లచుక్క చాలు కద

సహనాన్నే దహిస్తుంది కోపం చిన్నదైనా 


ఇసుమంతే విషపుచుక్క దేహమంత పాకేను

భవితవ్యాన్ని మారుస్తుంది వ్యసనం చిన్నదైనా 


రాసికాదు వాసిముఖ్యం ఎక్కడైనా 

మనసులనే మధిస్తుందీ కవనం చిన్నదైనా


Rate this content
Log in