చిన్న కోరిక
చిన్న కోరిక
మంచి కోరిక మనసైన కోరిక.
మల్లె జడలతో అలుముకున్న వేడుక.
గుభాలింపులతో విచ్చుకున్న రెండు
గువ్వల జంటల కోరిక.
ప్రపంచం లో ఆలుమగలు అంటే
అందమైన సృష్టికి మూలధనం.
భావితరాలకు బంగారు గుడులు.
రక్తం దారబోసి రాత్రి పగలు
శ్రమపడి విద్యా బుద్దులు నేర్పించే
అపురూపమైన కలయిక.
చింతలు ఉన్న చికాకులు ఎన్ని వున్న.
నిత్యం బిడ్డలు కోసమే ఆరాటపడే
తల్లి తండ్రుల చిన్ని కోరిక పిల్లల
బాగుకోరే ఒక ప్రేమ పక్షుల ఆశయం
ఒక చిన్న కోరిక.
అందం చూడరు.ఆకలిని మరచి,
వయసును గుర్తు ఎరుగరు. ఎంత వున్నది.
ఏమిలేదు తలవరు పిల్లలు గమ్యం
ఎటువెళుతుంది అనేదే వారి నిత్య ఆశ
వారి ఆనందం.అందుకే పిల్లలు చక్కగా
చదవాలి.మంచి భవిష్యత్ కోసం తపించాలి
ఆనాడే తల్లితండ్రుల చిన్ని గుండె కోరిక
తీరుతుంది. వారి ముఖం వికసిస్తుంది.
అదే కదా మనం అందించే నిజమయిన
బహుమతి.
