STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

4  

Midhun babu

Romance Classics Fantasy

చిన్న చిన్న ఆశలు

చిన్న చిన్న ఆశలు

1 min
4


మౌనం

అంగీకారం కాదేమో!

పెదవులు విచ్చి

పలుక లేనపుడు

ఎద మౌనాన్ని చుట్టుకుంటుంది

ఆ మౌనంలో

ఆశల వైఫల్యమో

నైరాశ్యమో

దుస్సహ సహనమో

చిరుకోపమో

ఏమూలో దాగిన అసంతృప్తో

కావచ్చు కారణం !


మేమెంత దాచినా

మా కనులు చెప్పకనే చెబుతాయ్

మా అంతరంగాన్ని...

కనుల భాష నేర్చుకోరూ...

ఎన్నడైనా నా కనులలోకి

చూశావా సూటిగా ?

కనురెప్పల నీడన

దాచుకున్న కలలు చూస్తావు కదా !

ఎన్నడైనా నా కళ్ళలో

కళ్ళు పెట్టి చూస్తేగా ?

కంటిపాపలోని ఆశల నలకలు

కనిపించడానికి ?

సిగ్గు విడిచి

నోరు తెరచి

ఏమని చెప్పను?

అంచెయానను కాదా ?

అందుకే ఈ‌ మౌనం !


 అనలేను నేను

నీకు నాపై ప్రేమ లేదని..

కొండంత ప్రేమను

గుండెలో నిక్షిప్తం చేసుకున్నావ్ !

గోళీప్రమాణాన బహిర్గతం చేస్తే

నీ సొమ్మేమీ పోదుగా!


నిరీక్షిస్తాను నీకోసం సందెలో

నీ ఇంటి గడపనై

కంటిని స్వాతిచిప్పలాచేసి...

వస్తావు నను దాటి వెళతావు

 గుర్తించనట్టే!

ఓ చిరునవ్వు పారేస్తే

కరువౌతుందా నీదేమైనా

చల్లారిన నా గుండె పొంగుతుందిగా !


కొత్త కోక కట్టి

నీ కాళ్లకు నమస్కరిస్తే

కాళ్లు లాక్కొని

మూగమొద్దులా వెళ్ళిపోతావ్!

నా నుదుటిపై 

ఓ చిరుముద్దు పారేస్తే

నా కరువు తీరుతుందిగా !


సినిమాకు తీసుకెళ్తావ్

మరచిపోతావ్

ప్రక్కన నేనున్నానని

చెయ్యి కలపొచ్చుగా 

విద్యుత్ వలయం పూర్తి కాదా ?


పగలంతా శ్రమించి

వగరుస్తూ నీ పక్కలోకొస్తే

ఒక్క సానుభూతి చూపొకటి

నాపై విసరొచ్చుగా ?

పడతికి పడకలో

'అది 'అద్వితీయం కాదు

ద్వితీయమో! తృతీయమో!

దాహం లేకపోయినా

నీరు త్రాగుతాం మీకోసం !

అదే అంతిమం అనుకోకు

మా చిన్ని చిన్ని ఆశలు గుర్తిస్తే

నందన వనమే గా సంసారం!



Rate this content
Log in

Similar telugu poem from Romance