STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

చీకట్లో

చీకట్లో

1 min
181

చీకటిలో దీపమై వెలిగే వెలుగువాడు,  

గోడల వెనుక నిల్చొని ఇంటి కౌగిలిని చూసే నాన్న,  

మన కోసం తన కలల బరువును నెత్తిన మోసుకున్నాడు,  

కానీ ఎప్పుడూ తన బాధలను మనకి చెప్పలేకపోయాడు.  


ప్రతి క్షణం ముందుకు తోసిన కాలం,  

నాన్న అడుగులు మాత్రం వెనక్కి తీసింది,  

తనకు ఇష్టం అయిన పంథాను వదిలి,  

మన కోసం పూలబాటను తీర్చిదిద్దాడు.  


ఓడిపోతున్న పోరాటాల మధ్య,  

ఆత్మవిశ్వాసాన్ని మనకే ఇచ్చి,  

తన గెలుపును మనలో వెతికినవాడు,  

నమ్మకమంటే నాన్ననే అనిపించినవాడు.  


మన అందమైన కలల కోసం,  

తన పగిలిన కలల బొమ్మలు గుప్పెడు దాచుకున్నాడు ఎందుకో మరి అప్పుడప్పుడు పగిలిన బొమ్మల్ని చూసి ఆనందించాలేమో,  

తన మాటల్లో ఒక ఆశ, తన చూపుల్లో ఓ ప్రేమ,  

అవి మాత్రమే తన సంపదగా మిగిలాయి.  


నాన్న ఎప్పుడో వెనుకబడ్డాడు,  

కానీ తన వెనకే మన విజయాల బాటలు ఉన్నాయి,  

ఆ అడుగులు గమనిస్తే, మనం ఎప్పుడు ముందుంటాం,  

అతనిది వెనుకబడడం కాదు, మానవతకు ముందుండడం.  



Rate this content
Log in

Similar telugu poem from Romance