చిగురించాలి
చిగురించాలి


ప౹౹
పారేసుకున్న మనసుకు మిగిలిందీ పారవశ్యమే
చేరవేసుకున్ప ఉసులు చెలికి చేరను ఆలస్యమే ౹2౹
చ౹౹
వలపు వాకిళ్ళ తెరను తొలగించక మౌనమేలా
తెలుప మదిలోని ఆకాంక్షనూ అనుమానమేలా ౹2౹
అవకాశాన్ని ఉపయోగించనూ ఉపేక్ష ఎందుకని
ఆకాశాన్ని హద్దుగ చేసి కదులు ప్రేమనందుకొని ౹ప౹
చ౹౹
చరవాణి సందేశం వచ్చుననీ ఎదురూ చూడక
చేరదీసి ఆ చెలియకై చేయించు ఎదురువేడుక ౹2౹
మధురమైనదీ మరులతో కూడుకున్న సందేశం
అధరంపైన సంతకమొకటి చేసేయ్ చేసి నిర్దేశం ౹ప౹
చ౹౹
అందమైనదేగ తరుణి మనసు మందిరమంతా
పొందటానికి అర్పించు ఎలమి సుందరమంతా ౹2౹
మది రగిల్చిన మంటనే ఆ మగువే చల్లార్చాలి
అది మిగిల్చిన ఆ గురుతులెపుడు చిగుర్చాలి ౹ప౹