చెప్పాలన్న మాట
చెప్పాలన్న మాట
నాకు తోడుగా ఉండే నా నేస్తం
నీతో మనసువిప్పి మాట్లాడాలి అనుకున్న క్షణం
నా మనసు పలికే రాగాలను నీకు వినిపించలేక
మౌనమే సమాధానంగా నా గొంతు మూగబోతుంది
నిన్ను చూస్తూ నా మనసు కలల లోకంలో విహరిస్తుంది
నీ నీడే నేనుగా , నీ శ్వాసే నా ఉపిరిగా, నీతో విహరించే
మదురమైన క్షణాలను చూస్తూ కాలం కరిగిపోయింది
కానీ నీతో 'చెప్పాలన్న మాట' మాత్రం మిగిలి పోయింది

