చెలియా
చెలియా
నీ చూపుల వెన్నెలయే..గీతములే చెలియా..!
నీ వాడని ఆ మౌనమె..కావ్యములే చెలియా..!
మౌనానికి నిర్వచనం..చెప్పాలా ఎవరో..
నీ రెప్పల సవ్వడికే..సాధ్యములే చెలియా..!
అనురాగపు కోవెలకో..రూపమెలా చూపను..
గంధాలను రాల్చే నీ..హృదయములే చెలియా..!
నేనేమిటి గజలేమిటి..కురిసేదది ఏదో..
సెలయేఱుల సాక్షిగ నీ..హాసములే చెలియా..!
పద్యమేదొ గద్యమేదొ..హృద్యమేదొ ఏమో..
గగనాలను ఏలే నీ..పాదములే చెలియా..!
లోనిగాలి వెలుగులతో..మమేకమగుటేలా..
కన్నులింట నిలిపే నీ..ధ్యానములే చెలియా..!

